అక్షర టుడే ఆర్మూర్ : ఆర్మూరు బార్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి జెస్సు అనిల్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తు ఫారాలు అందజేశారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్యకు సోమవారం దరఖాస్తు పత్రాలను ఆయన అందించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి, అరుణ్ కుమార్, చిలుక కిష్టయ్య, పోచన్న, ఆవుల అశోక్, జిజి రామ్, ఆవారి రమేష్, ఖాందేశ్ సంగీత, గణేష్ పాల్గొన్నారు.