అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉదయపు నడక సాగిస్తున్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడిలో నరేందర్‌ రెడ్డి కుట్ర ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి చేసిన రోజు నుంచే పోలీసులు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ.. కరెంట్‌, ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేసి సోదాలు చేశారు. సుమారు 30 మంది 55 మందిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం 16 మందిని కోర్టుకు తరలించి రిమాండ్‌ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించగా.. పరిగి సబ్‌ జైలుకు తరలించారు.