అక్షరటుడే, ఆర్మూరు: ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. భారీ వర్షాలకు అమీర్ నగర్- కోనసముందర్, వేల్పూర్- రామన్నపేట్ గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. వెంటనే రాకపోకలు పునరుద్ధరించడానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.