అక్షరటుడే, ఆర్మూర్: కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూరు మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రమేష్ భార్య రజితకు రూ.రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును శుక్రవారం ఆయన అందజేశారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కేసీఆర్ బీమా సౌకర్యం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగనాథ్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రాజకుమార్,శ్యామ్ రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement