అక్షరటుడే, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ద్వాదశ దినకర్మను బుధవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘంలో నిర్వహించారు. డీఎస్ తనయులు మాజీ మేయర్ సంజయ్, ఎంపీ అర్వింద్‌తో పాటు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, కాంగ్రెస్, బీజేపీ నేతలు, మున్నూరు కాపు నాయకులు, ప్రజలు పాల్గొని డీఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.