అక్షరటుడే, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం చోటు చేసుకుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సొరంగం కుంగిపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నట్లు గుర్తించినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకు రావాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.