అక్షరటుడే, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టు దుర్మార్గం అని పేర్కొన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరుతో.. చిచ్చుపెట్టడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను అరెస్టు చేయడమేనా..? అని నిలదీశారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణిచివేయలేరని స్పష్టం చేశారు. పట్నం నరేందర్‌రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.