అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు.