అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ నాయకులు బెదిరింపులతో గ్రామసభలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రజాపాలన గ్రామసభల నిర్వహణపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోసపూరిత కాంగ్రెస్ హామీలపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. దీంతో పోలీస్ పహారాలో గ్రామసభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పథకాలపై ప్రశ్నించిన వారిపై ఖాకీల జులూమే సమాధానమా అని ఆయన ప్రశ్నించారు. ఆంక్షల మధ్య అర్హులను ఎలా ఎంపిక చేస్తారన్నారు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని, దరఖాస్తుల దందా నడవదని ఆయన పోస్ట్ చేశారు.
Advertisement
Advertisement