అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్‌ నాంపల్లి కోర్టులో దావావేశారు. ఈమేరకు బుధవారం కోర్టుకు హాజరై కేటీఆర్‌ వాంగూల్మం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మెజిస్ట్రేట్‌ ముందు మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని తెలిపారు. తాను ఓ డ్రగ్‌ అడిక్ట్‌, రేవ్‌ పార్టీలు నిర్వహిస్తానంటూ మీడియా ముఖంగా అసంబద్ధమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈకేసులో సాక్షులు గత 18 సంవత్సరాలుగా తెలుసనని అన్నారు. తనతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం చేయాలని కొండ సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో రికార్డింగ్స్‌ను కూడా కోర్టుకు అందజేశారు. ఈకేసులో కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టులో రికార్డు చేశారు. మిగతా సాక్షుల స్టేట్‌మెంట్‌ రికార్డును మెజిస్ట్రేట్‌ 30కి వాయిదా వేశారు.