నత్తనడకన ఎస్ఆర్ డీపీ పనులు : కేటీఆర్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి చేపట్టిన ఎస్ఆర్ డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) పనులు నత్తనడకన సాగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి.. 36 పనులను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వంలో పనులు మందగించాయని పేర్కొన్నారు. 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక, సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఎస్ఆర్ డీపీ మూడో దశ పనులను కూడా ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో మూసీ వద్ద ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు ఇతర పనులు ఉన్నాయని తెలిపారు.