అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని 20 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులచ్చాయి. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం.. పోరాటం తెలంగాణకు కొత్త కాదు.. ఈమట్టి పొత్తిళ్లలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకై పోరాడుతాం.. జై తెలంగాణ’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, ఈట్వీట్ చర్చనీయంశంగా మారింది.