అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ‘కాంగ్రెస్ అంటేనే పెద్ద అవినీతి గని.. దేశానికి పట్టిన శని’ అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ గ్రామంలోనైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నూరు శాతం అమలైనట్లు చూపిస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మాట తప్పడం..మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి పేటెంట్గా మారిందని విమర్శించారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త డ్రామాలు ఆడేందుకు కాంగ్రెస్ మరోమారు సిద్ధమైందన్నారు. హామీల పేరుతో మోసం చేసేందుకు గ్రామాలకు వస్తే తిప్పికొట్టాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు. బీసీ కులగణన పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి బీసీల గొంతు కోశారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు చెదలు పట్టేలా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి చిట్టచివరి సీఎం రేవంత్‌రెడ్డే అవుతారని జోస్యం చెప్పారు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి అల్జీమర్ జబ్బు ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లది అవినీతి బంధమని విమర్శించారు.
కాంగ్రెస్ అంటే అవినీతి గని.. దేశానికి పట్టిన శని: జీవన్‌రెడ్డి
Advertisement
Advertisement