అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్‌ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిగాల మాట్లాడుతూ మేయర్ భర్త దండు శేఖర్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సాక్షాత్తు మేయర్ భర్తపై దాడి జరగడంతో శాంతి భద్రతలు ఎలా దెబ్బతిన్నాయో ప్రజలు గమనించాలన్నారు. మా ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల రక్షణకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల అలా లేవన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఉరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయని.. అంతేకాని హత్యాయత్నాలు, దాడులు సరికాదన్నారు. దాడి వెనుక ఎవరి హస్తం ఉన్నా వారందరిని శిక్షించాలని.. అందుకోసం పోరాటం చేస్తామని తెలిపారు. మేయర్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.