Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్‌ కాండ్లి గ్రామ జీపీకి పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి రూ. 39 లక్షలతో రోడ్డు మంజూరైనట్లు ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు విఠల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేగాంలోని తన నివాసంలో గ్రామస్తులకు ప్రోసీడింగ్ కాపీ అందజేశారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నిధులు మంజూరు చేసినందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గంగయ్య, మాజీ జడ్పీటీసీ బుచ్చన్న, వీడీసీ ఛైర్మన్‌ కిషన్‌, తోట నర్సయ్య, సుధాకర్‌ ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | చోరీలు, చైన్​ స్నాచింగ్​ల​ కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌..