అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

మంద జగన్నాథం మే 22, 1951న నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో జన్మించారు. మెడిసిన్ చదివిన ఆయన తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు(1996, 1999, 2004, 2009) ఎంపీగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో నవంబర్ 17, 2023న భారాస విడి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఇవ్వకపోవడంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం రాజస్థాన్ లోని ఆళ్వార్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18, 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  TGS RTC | అద్దెబస్సుల కోసం సజ్జనార్‌కు రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్​ఎస్​