Advertisement
అక్షరటుడే, కోటగిరి: మండలంలోని గన్నారం(లింగాపూర్) గ్రామంలో పెద్దపోచమ్మ, భారడి పోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్ దేగం హన్మంతు తెలిపారు. ఆలయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పూజ్య డాక్టర్ బసవలింగ అవధూత మహరాజ్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని సూచించారు.
Advertisement