అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం రాజన్న(83) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన 18 ఏళ్ల పాటు అంకాపూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. 40 ఏళ్ల క్రితం గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి, గ్రామంలో అభివృద్ధి ఐక్యత ప్రగతిని పెంపొందించడంలో రాజన్న కీలక పాత్ర పోషించారు. విద్యతోనే గ్రామం దేశం అభివృద్ధి చెందుతుందని ఎందరో విద్యార్థులను ప్రోత్సహించి అంకాపూర్ నుంచి 30 ఏళ్ల క్రితమే అమెరికా బాట చూపించిన చూపించిన వ్యక్తి రాజన్న. హైదరాబాద్లో ఆయన పార్థివ దేహాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైడి రాకేశ్ రెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం అంకాపూర్ లో రాజన్న అంత్యక్రియలు జరగనున్నాయి.