అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: బీఆర్‌ఎస్‌ నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నామని జెడ్పీ మాజీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. శుక్రవారం పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌లకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.