అక్షరటుడే, ఎల్లారెడ్డి: సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసి విన్నవించారు. కళాశాలలో మూడునెలలుగా రసాయన శాస్త్రం, అర్ధశాస్త్రం, హిందీ బోధించే అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లా నోడల్‌ అధికారి స్పందించి తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సాయగౌడ్, లింగం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.