అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రుణమాఫీ నిధులు పలువురు రైతులకు జమకాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సదాశివనగర్‌ యూనియన్‌ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులు పలువురు రుణం మాఫీ అయ్యిందని బ్యాంకుకు వెళితే.. ఇంకా జమ కాలేదన్న సమాధానం బ్యాంకు అధికారుల నుంచి వస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు జమచేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకోవడమేంటని మండిపడుతున్నారు.