అక్షరటుడే, వెబ్ డెస్క్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం మేఘన డెంటల్ కాలేజ్ సమీపంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సీఐ పురుషోత్తం సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.1,03,810 నగదు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సిబ్బంది లక్ష్మన్న, రాజేశ్వర్, రాములు, అనిల్ కుమార్, నర్సయ్య, సుధాకర్, ఆజాం పాల్గొన్నారు.