Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఉత్తరాఖండ్​ లోని బద్రీనాథ్​లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బద్రీనాథ్​లోని మానా గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం మంచుచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు 57 మంది మంచు పెళ్లల కింద చిక్కుకున్నారు. ఇందులో 51 మందిని వెలికి తీసిన సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఇందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement