అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ దేశంలోని ప్రముఖ నోట్రడామ్ చర్చి తిరిగి అందుబాటులోకి వచ్చింది. నూతన హంగులతో ఈ చర్చిని పున:ప్రారంభించారు. 861 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ చర్చి 2019లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైంది. నూతన చర్చిని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.