అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Free School | తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు(Orphans) ఉచిత విద్య అందిస్తూ అండగా నిలుస్తోంది హీల్(Heal) ప్యారడైజ్ విద్యాసంస్థ. అమ్మానాన్నలను కోల్పోవడంతో ఎంతోమంది చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి చేయూత అందిస్తోంది డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన హీల్ ప్యారడైజ్. ఈ పాఠశాల ఏలూరు(Eloor) జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో ఉంది.
Free School | కార్పొరేట్‌కు దీటుగా
హీల్ పాఠశాలలో కార్పొరేట్‌కు దీటుగా విద్య(Education) బోధన చేపడతారు. 90 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న పాఠశాలలో విద్య, వసతి, భోజనం ఉచితంగా అందిస్తారు. ఇందులో ఒకటో తరగతి ఇంటర్ వరకు ఉంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు, ఇంటర్లో ప్రవేశాలకు(Admissions) దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటర్లో చేరడానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
Free School | దరఖాస్తుల ఆహ్వానం
వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు (Applications) ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. తల్లి లేదా తండ్రి మరణ ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, రేషన్‌కార్డుతో మార్చి 18 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కింది లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://heal.myclassboard.com/OnlineEnquiryForm_New/9A1FEF0D-66E5-4CF8-9CE4-061A80455A5F