అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Polytechnic Coaching | దోమకొండ గడీకోట ట్రస్ట్(Domakonda Gadikota Trust) ఆధ్వర్యంలో పదో తరగతి పూర్తి చేసుకున్న నిరుపేద విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్(Free Polytechnic Entrance Coaching)ను సోమవారం ప్రారంభించారు. స్థానిక ఆనంద్ భవన్లో శిక్షకులు ఆయా అంశాలపై విద్యార్థులకు శిక్షణను ప్రారంభించారు. కొన్నేళ్లుగా తమ ట్రస్ట్(Trust) ద్వారా ఎందరో విద్యార్థులు సీట్లు సాధించే శిక్షణ ఇప్పిస్తున్నామని గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి(Gadikota Trust Manager Babji) పేర్కొన్నారు.
దోమకొండ(Domakonda) మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల విద్యార్థులు(Students) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99122 92001, 94931 43378 నంబర్లను సంప్రదించాలని ట్రస్ట్ ప్రతినిధి గణేష్ యాదవ్ పేర్కొన్నారు.