అక్షరటుడే, వెబ్‌డెస్క్ Netflix : ప్రముఖ ఓటీటీ ఛానల్ (Netflix) నెట్‌ఫ్లిక్స్, గ్లోబల్ స్ట్రీమింగ్ సర్వీస్, Global streaming service అనేక రకాల టీవీ షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు అనిమేలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇది 190 దేశాలలో 30కి పైగా భాషల్లో కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. భారతదేశంలో, Netflix రెండు విధాలుగా మనకు అందుబాటులో ఉంది. ఒకటి నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుండి నేరుగా స్వతంత్ర సేవా ప్లాన్‌ల ద్వారా పొందవచ్చు. లేదంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ISPలు లేదా టెలికాం ప్రొవైడర్ల నుండి OTT బండిల్ ఆఫర్‌గా వస్తుంది. రోజురోజుకి నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ప్రయత్నం చేస్తుంది.
Netflix : ఆలస్యం చేయకండి..
తాజాగా (Netflix) నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుండి, Netflixలో మాత్రమే వీక్లీ షోలు, ప్రీమియం లైవ్ ఈవెంట్‌లు మరిన్నో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్,ట్రిపుల్ హెచ్, రా, స్మాక్ డౌన్,ఎన్ఎక్స్‌టీ, రెజిల్ మానియా ఇలా ఎన్నో కూడా ఇప్పుడు మన ఇండియాలో ప్రసారం అవుతాయి. ఇక ప్లాన్‌లు నెలకు రూ.149 నుండి ప్రారంభమవుతాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇప్పుడు (Netflix) నెట్ ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలు, షోస్ కూడా ప్రసారం అవుతున్నాయి. ఇందులో ప్రసారం అయ్యే కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ కంటెంట్‌ని ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్వప్ మాట్లాడుతూ.. బ్రిటిష్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘అడోలసెన్స్’ Adolescence పై ప్రశంసలు కురిపించాడు. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఇలాంటి సిరీస్‌ను తెరకెక్కించినందుకు గర్వంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ సిరీస్ చూస్తున్నంతా సేపు చాలా అసూయపడ్డాను. ఇలాంటి కథలు మనదగ్గర ఎందుకు రావడం లేదని అవేదన వ్యక్తి చేసినట్లు అనురాగ్ తెలిపాడు.
View this post on Instagram