అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali | ప్రాణహిత చేవెళ్ల (Pranahitha chevella) 22వ ప్యాకేజీ పనులకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ సలహాదారు(Shabbir Ali ) షబ్బీర్ అలీ తెలిపారు. ఆదివారం జల సౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam kumar reddy అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని Nizamabad ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీ 20, 21, 21ఏ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మునిపల్లి ఎత్తిపోతల పథకం పెండింగ్ బకాయిల విడుదల, ఆర్మూర్ నియోజకవర్గంలోని నాలుగు మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణ, చౌటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో పైపులైన్ లీకేజీల మరమ్మతులు, సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారన్నారు. అలాగే జిల్లాలో ఇతర సాగు నీటి పథకాలపై చర్చించినట్లు వివరించారు.