అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రంలోని మాజీ వార్డు సభ్యుడు గడ్డమీది యాదగిరి కుమార్తె రమ్య వివాహం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు భీంరెడ్డి, నేతలు అందె దయాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సిద్దాగౌడ్‌, సాజిద్‌, డాక్టర్‌ సుదర్శన్‌, అంజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.