MP Arvind | గల్లీమే కుస్తీ.. చెన్నైమే దోస్తీ : ఎంపీ అర్వింద్​ సంచలన ఆరోపణలు

MP Arvind | గల్లీమే కుస్తీ.. చెన్నైమే దోస్తీ : ఎంపీ అర్వింద్​ సంచలన ఆరోపణలు
MP Arvind | గల్లీమే కుస్తీ.. చెన్నైమే దోస్తీ : ఎంపీ అర్వింద్​ సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | సీఎం రేవంత్​రెడ్డి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​​ KTR ఇక్కడ కుస్తీ పడుతూ చెన్నైలో దోస్తీ చేస్తున్నారని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. డీలిమిటేషన్​పై చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ Tamilnadu cm stalin అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశంపై ఆయన స్పందించారు. ఈ మీటింగ్​కు రేవంత్​రెడ్డి revanth reddy, కేటీఆర్​ వెళ్లడంపై ఆయన విమర్శలు చేశారు. బీఆర్​ఎస్​ BRS ఇండియా కూటమిలో కలిసిపోయిందా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement

MP Arvind | ఎన్నికలు ఉండటంతో నాటకం

డీఎంకే DMK లాంటి పార్టీని మళ్లీ లేవకుండా నేలకు వేసి తొక్కాలని ఎంపీ ​ అన్నారు. తమిళనాడులో Tamilnadu  త్వరలో ఉన్నాయని, ఓడిపోతామని తెలియడంతో డీఎంకే పార్టీ కొత్త నాటకం ఆడుతోందన్నారు. 1971తో పోలిస్తే దేశంలో ముస్లిం జనాభా Muslim population భారీగా పెరిగిందని, దాని డీఎంకే స్పందించాలన్నారు. స్టాలిన్​, ఆయన కుమారుడు ఉదయనిధి రాజకీయాలను Politics నుంచి మాయం చేయాలని తమిళనాడు ప్రజలను ఆయన కోరారు. దక్షిణ భారతం, ఉత్తర భారతం పేరుతో విభజన రాజకీయాలకు డీఎంకే తెర లేపిందన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Komatireddy | మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా.. మంత్రి కీలక వ్యాఖ్యలు

MP Arvind | జనాభా పెరుగుదలలో వ్యత్యాసం లేదు

ఎంపీ మాట్లాడుతూ 1971తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదలో ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు వ్యత్యాసం లేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఒకేరీతిలో ఉందని ఆయన చెప్పారు. ఒక్క తమిళనాడులో మత్రం జనాభా Tamilnadu population పెరుగుదల తక్కువగా ఉందన్నారు. 1971 జనాభా లెక్కలు, ప్రస్తుతం జనాభా లెక్కల అంచనాలను ఆయన వివరించారు.

MP Arvind | ఆ బిల్లులకు సపోర్ట్​ చేస్తారా..

జనాభా పెరుగుదలపై మాట్లాడుతున్న డీఎంకే నేతలు DMK Leaders యూనిఫాం సివిల్​ కోడ్​కు, ఎన్​ఆర్​సీకి మద్దతు ఇస్తారా అని ఎంపీ ప్రశ్నించారు. దేశంలో 1971తో పోలిస్తే హిందు జనాభా మూడు రెట్లు పెరిగితే, ముస్లింల జనాభా Muslim population 7 రెట్లు పెరిగిందన్నారు. దీనిపై స్టాలిన్​ సమాధానం చెప్పాలని అర్వింద్​ డిమాండ్​ చేశారు.

Advertisement