అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి సీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్‌(డీహెచ్‌)కు సరెండర్‌ చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ ప్రవీణ్‌ పై పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు కావడం, రెగ్యులర్ గా విధులకు హాజరు కాకపోవడంతో వేటుపడింది. డాక్టర్‌ ప్రవీణ్‌కు సంబంధించిన సమన్విత ఆస్పత్రిలో ఐదు నెలల గర్భిణికి లింగ నిర్ధారణ చేసిన ఘటనలో మహారాష్ట్రలోని ఉద్గీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా.. ఆయనను 29న అక్కడి పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ పై వచ్చారు. అలాగే ఈ ఏడాది జూలైలో కూడా సదరు ఆస్పత్రిలో శిశువును విక్రయించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే గాంధారి సీహెచ్‌సీకి రెగ్యులర్ గా విధులకు హాజరు కాకపోవడంతో ప్రవీణ్‌ను సరెండర్‌ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.