అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఆందోళనకు దిగారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ జీవన్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. జీవన్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘నాలుగు దశాబ్దాలు కష్టానికి మంచి బహుమతి ఇచ్చారని.. పార్టీలోకి ఎందుకు కొనసాగాలి.. దయచేసి నన్ను క్షమించండి’ అంటూ ఫోన్‌ కట్‌ చేశారు.