అక్షరటుడే, వెబ్‌డెస్క్ : శీతాకాలం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ఆలయాలను 6 నెలల పాటు మూసివేయనున్నారు. గంగోత్రి ధామ్ ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు అధికారులు మూసివేశారు. యుమునోత్రి ధామ్ తలుపులను ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు, కేదార్‌నాథ్ ఆలయాన్ని ఆదివారం ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. చార్‌ధామ్ యాత్ర ఈఏడాది మే10న ప్రారంభం కాగా.. శుక్రవారం సాయంత్రం నాటికి ఈక్షేత్రాలను 15లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.