అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. జెన్‌పాక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అక్షరధామ్ స్కూల్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జెన్‌పాక్ట్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలు యువతకు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలో ప్రైవేటు ఐటీ కంపెనీలను సంప్రదించి ఇందూరులో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెన్‌పాక్ట్ హెచ్‌ఆర్ వైష్ణవి, బీజేపీ నాయకులు పంచరెడ్డి లింగం, నారాయణ యాదవ్, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, గడ్డం రాజు, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.