Ghibli Style AI Images | సోషల్​ మీడియాలో సందడి చేస్తున్న గిబ్లి స్టైల్ చిత్రాలు

Ghibli Style AI Images | సోషల్​ మీడియాలో సందడి చేస్తున్న గిబ్లి-స్టైల్ చిత్రాలు
Ghibli Style AI Images | సోషల్​ మీడియాలో సందడి చేస్తున్న గిబ్లి-స్టైల్ చిత్రాలు

​అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghibli Style AI Images | ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లి స్టైల్​ ఏఐ ఇమేజ్​లు సందడి చేస్తున్నాయి. ఓపెన్ ​ఏఐ తన కొత్త GPT-4o ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను ఇటీవల రిలీజ్ చేసింది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఈ మోడల్ సహాయంతో ప్రజలు తమ చిత్రాలను అప్‌లోడ్ చేసి నచ్చినట్లు చేయమని అడుగుతున్నారు.

Advertisement
Advertisement

ప్రజలు తమ ఫొటోలను అప్​లోడ్​ చేసి, నచ్చిన ప్రాంతంలో ఉన్నట్లు పెట్టమని అడిగితే ఏఐ సాయంతో అలానే చేస్తోంది. దీంతో యూజర్లు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఉన్నట్లు ఫొటోలను జనరేట్​ చేసుకొని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. అలాగే నచ్చిన వారితో ఫొటో దిగినట్లు క్రియేట్​ చేసుకుంటున్నారు. ఇందులో తమ ఫొటోలను అప్​లోడ్​ చేసి గిబ్లి స్టైల్​లో మార్చుకొని మురిసిపోతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Smart Phones | రోజుకు ఐదు గంటలు అందులోనే.. స్మార్ట్​ఫోన్​ చూస్తూ గడిపేస్తున్న ఇండియన్లు

జపాన్​కు చెందిన యానిమేషన్​ సంస్థ గిబ్లి చిత్రాలను రూపొందించింది. 1985లో ఏర్పాటైన ఈ సంస్థ గిబ్లి స్టూడియో ద్వారా అనేక చిత్రాలను రూపొందించింది. ఇందులో ఉండే క్యారెక్టర్ల రూపంలో తాజాగా ఏఐ సాయంతో తమ ఫొటోలను మార్చుకొని నెటిజన్లు సంబుర పడుతున్నారు.
గిబ్లి స్టైల్​లో ఇమేజ్​లను ఎలా చేసుకోవచ్చంటే..

  • మొదట chatgpt.comలో లాగిన్ అవ్వాలి.
  • మోడల్ సెలక్షన్ ట్యాబ్​ నుంచి GPT-4o మోడల్‌ను ఎంచుకోవాలి.
  • అటాచ్ ఫైల్​పై నొక్కి రీస్టైల్ చేయాలనుకుంటున్న చిత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
  • పిక్చర్​ను అప్‌లోడ్ చేసిన తర్వాత, దాన్ని స్టూడియో స్టైల్ ఆర్ట్​గా చేయమని ChatGPTకి సూచించాలి.

Advertisement