అక్షరటుడే, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని బంజారా హోటల్ ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా టాక్స్ చెల్లించకపోవడంతో బంజారా హోటల్ పై అధికారులు చర్యలు చేపట్టారు. రెడ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల స్వర్గధామంగా భావించే బంజారా హోటల్ రూ.1.40 కోట్ల టాక్స్ చెల్లించాల్సి ఉంది.