Stock market | గ్లోబల్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Stock market | గ్లోబల్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ
Stock market | గ్లోబల్‌ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | ట్రంప్‌ టారిఫ్‌(Trump tariff) పాజ్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. సోమవారం ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) అన్నీ పాజిటివ్‌గానే ముగిశాయి. ఆసియా మార్కెట్లు మంగళవారం గ్రీన్‌ జోన్‌లోనే ఉన్నాయి. దీంతో మన మార్కెట్లు సైతం భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Stock market | అమెరికా మార్కెట్లు..

అమెరికాకు చెందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు(american stock exchange) సోమవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ(S&P) 0.79 శాతం, నాస్‌డాక్‌ 0.64 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం స్వల్ప నష్టంతో కొనసాగుతోంది.

Stock market | యూరప్‌ మార్కెట్లు..

యూరప్‌ మార్కెట్లు భారీ ర్యాలీ తీశాయి. డీఏఎక్స్‌ 2.77 శాతం లాభపడగా.. సీఏసీ 2.3 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 2.09 శాతం పెరిగాయి.

Stock market | ఆసియా మార్కెట్లలోనూ జోష్‌..

ఆసియా స్టాక్‌ మార్కెట్లలోనూ(asian stock market) రిలీఫ్‌ ర్యాలీ(Relief rally) జోష్‌ కొనసాగుతోంది. జపాన్‌కు చెందిన నిక్కీ 0.88 శాతం పెరిగింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్ట్రేయిట్స్ టైమ్స్‌ 1.53 శాతం లాభంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ మార్కెట్‌(Taiwan Stock Market) 1.45 శాతం, కోస్పీ 0.86 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.1 శాతం లాభంతో కదలాడుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై(Shanghai) మాత్రం 0.3 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 1.15 శాతం లాభంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock Market | కొనసాగిన ర్యాలీ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock market | గమనించాల్సిన అంశాలు..

గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఎఫ్‌ఐఐ(FII)ల అమ్మకాలు కొనసాగాయి. వారు నికరంగా రూ. 2,519 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా ఇదే సమయంలో డీఐఐ(DII)లు నికరంగా రూ. 3,759 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

  • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.23 శాతం పెరిగినా 100కు దిగువనే కొనసాగుతోంది. ఇది మూడేళ్ల కనిష్టం కావడం గమనార్హం.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ ఈల్డ్‌ 0.6 శాతం క్షీణించి 4.35 వద్ద ఉంది.
  • డాలర్‌ విలువ క్షీణిస్తూ రూపాయి విలువ బలపడుతోంది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 86.05 రూపాయల వద్ద ఉంది.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర స్వల్పంగా పెరిగింది. బ్యారల్‌కు 0.22 శాతం పెరిగి 61.67 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
  • ఇండియన్‌ మార్కెట్లలో వొలటాలిటీ కాస్త తగ్గింది. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో విక్స్‌(VIX) 6.17 శాతం తగ్గి 20.11 వద్ద ఉంది.
Advertisement