అక్షరటుడే, ఇందూరు: నిత్యం తెలుగు మాట్లాడడం, వాడడం వల్ల భవిష్యత్ తరాలకు తెలుగు అందుతుందని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలుగు భాషను విరివిగా వాడాలన్నారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామస్వామి మాట్లాడుతూ.. గిడుగు రామ్మూర్తి తెలుగు కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. భాష అంటే కేవలం సమాచారం అందించే మాధ్యమం కాదని, అది జాతి ఉనికిని, నాగరికతను, సంస్కృతిని తెలిపే సాధనమన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ స్టడీ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ రంజిత, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, అధ్యాపకులు కత్తి గంగాధర్, రాజేశ్వర్, రాధిక, అజయ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.