అక్షరటుడే, వెబ్డెస్క్: BJP | చిత్ర గుప్త యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న బీజేపీ కార్యకర్త గిరీష్ దారమోని(Girish Daramoni) కేంద్ర మంత్రి బండి సంజయ్(bandi sanjay) లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో గతంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్(Suspend) చేశారు.
అయినా యూట్యూబ్ ఛానెల్(YouTube channel) ద్వారా బండి సంజయ్ ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నాడని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఆయన ఆఫీస్(office)పై దాడి జరిగింది. తాజాగా ఆయన ఇంట్లోకి వెళ్లిన మహిళలు, యువకులు చెప్పులతో దాడి చేశారు.