అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మనగర్ కు చెందిన కట్ట లలిత కడుపు నొప్పితో బాధ భరించలేక బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.