అక్షరటుడే, వెబ్‌డెస్క్ Tariff War : టారిఫ్ వార్ (Tariff war)తో కుదేలయిన వివిధ దేశాల స్టాక్ మార్కెట్లు.. చైనా(China) మినహా మిగతా దేశాలపై సుంకాల అమలు నిర్ణయానికి 90 రోజులపాటు బ్రేక్ వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో రికవరీ బాటపట్టాయి. కొన్ని ఇండెక్స్‌లు రికార్డు స్థాయిలో పెరిగాయి. బుధవారం అమెరికా(America)కు చెందిన నాస్‌డాక్ 12.16 శాతం పెరగ్గా ఎస్‌అండ్‌పీ 9.52 శాతం ర్యాలీ తీసింది. గురువారం ఆసియాతోపాటు యూరప్ మార్కెట్లు కూడా ర్యాలీ అయ్యాయి. మహావీర్ జయంతి సందర్భంగా మన మార్కెట్లకు ఈ రోజు సెలవు కాగా మిగతా ఆసియా(Asia) దేశాల మార్కెట్లన్నీ పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి.
ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన తర్వాత భారీగా పడిపోయిన జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei).. గురువారం కోలుకోవడమే కాకుండా 8.36 శాతం పెరిగింది. తైవాన్ స్టాక్ మార్కెట్ 8.46 శాతం లాభపడగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 6.19 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్ 2 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.14 పెరిగాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 5 శాతం లాభంతో కొనసాగుతోంది. యూరోప్ మార్కెట్లలోనూ జోష్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో DAX 5.3 శాతం పెరగ్గా.. CAC 5.1 శాతం, FTSE 3.9 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Tariff War : నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ రికార్డులు..
Nasdaq కాంపోజిట్ బుధవారం 1,857 పాయింట్లు(12.16 శాతం) పెరిగింది. ఇది జనవరి 2001 తర్వాత ఒక రోజు గరిష్ట పెరుగుదలగా రికార్డయ్యింది. S&P 500 index 474 పాయింట్లు(9.5 శాతం) పెరిగింది. 2008 అక్టోబర్ 13న ఎస్‌అండ్‌పీకి ఇదే ఒక రోజు గరిష్ట పెరుగుదల కావడం గమనార్హం.Tariff War : గ్లోబల్ మార్కెట్లలో జోష్.. టారిఫ్‌ల అమలు వాయిదాతో రికార్డు ర్యాలీలు