అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజైన గురువారం రాత్రి పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న శేష వాహనంపై అభయమిచ్చారు. చిన్న శేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఈ వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు, జెఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఇతర అధికారులు పాల్గొన్నారు.