అక్షర టుడే, వెబ్ డెస్క్ Today Gold Rate : బంగారం (Gold) కొనుక్కొని ధరించాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం పసిడి రేటు ఏకంగా రూ.90 వేలు దాటేసింది. దీంతో కొందామంటే సామాన్యులకు శక్తికి మించిన భారంగా తయారవుతోంది. రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని కొనడానికి సామాన్యుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే తులం బంగారం ధర (Gold Rate) రూ.92 వేల మార్కు దాటి రికార్డు సృష్టించింది. ఇక ఈ రోజు పుత్తడి ధరలు మరికాస్త పెరిగి పసిడి ప్రియుల కంట కన్నీరు పెట్టించింది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,010 పలకగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,800 పలికింది.
Today Gold Rate : వణికిస్తున్న ధరలు.
ఇక కిలో వెండి Silver ధర రూ. 1,03,950 పలికింది. ఇక ఈ రోజు ఏకంగా 24 క్యారెట్ల (Gold Rate) బంగారం తులం రూ.92,400 చేరుకుంది. ధరల జోరు చూస్తుంటే త్వరలోనే లక్ష మార్కు చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (Gold Libra) బంగారం తులం (10 గ్రాములు) రూ.92,400 ఉండగా.. 22 క్యారెట్ల (Gold Libra) బంగారం తులం (10 గ్రాములు) రూ. 84,000 పలుకుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం తులం (Gold) (10 గ్రాములు) రూ.89,630 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 82,600 పలుకుతుంది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.91,150 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 84,400 పలుకుతుంది.
రాజమహేంద్రవరంలో 24 క్యారెట్ల (Gold) బంగారం తులం (10 గ్రాములు) రూ.91,800 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 83,540 పలుకుతుంది.విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,870 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 83,600 పలుకుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి శనివారం రూ.1,03,950 ఉండగా ఈ రోజుకి ధర కాస్త తగ్గింది. మార్చి 30న కిలో వెండి ధర రూ.1,02,684 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో పెరిగింది. అక్కడ కిలో వెండి శనివారం Saturday రూ.1,02,100 ఉండగా ఈ రోజు రూ.1,03,200 పలుకుతోంది. పొద్దుటూరులో నిన్న రూ.1,02,000 ఉండగా ఈ రోజుకి రూ.1,01,200కి దిగొచ్చింది. రాజమహేంద్రవరంలో నిన్న కిలో (Silver price) వెండి రూ.1,03,000 ఉండగా ఈ రోజు రూ.1,05,000కి పెరిగింది. విశాఖపట్నంలో శనివారం కిలో (Silver price) వెండి ధర రూ.1,05,000 ఉండగా.. ఆదివారం నాటికి ఇంకాస్త పెరిగి రూ.1,08,000కి చేరుకుంది.