అక్షరటుడే, వెబ్డెస్క్: Today Gold price | కొద్ది రోజులుగా బంగారం రేటు వింటేనే వణుకు పుడుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం తప్పనిసరిగా కొనాల్సి వస్తుంది. కానీ ధరలు చూసి భయపడాల్సి పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్(Trump tafiffs) బాదుడుతో స్టాక్ మార్కెట్లు, ఎల్లో మెటల్స్, క్రూడ్ ఆయిల్ ధరలు అతలాకుతలం కావడంతో ఇన్వెస్టర్ బంగారం ధర(Gold rate)పై పెట్టుబడి పెడుగుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకునేందుకు బంగారం విక్రయిస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు పసడి ధరలు తగ్గాయి.
Today Gold price | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 07 ఏప్రిల్ 2025 సోమవారం 22 క్యారెట్ల బంగారం(22 carat gold) 10 గ్రాముల ధర రూ.83,090, 24 క్యారెట్ల(24 carat gold) పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,650 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది . హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,240, 24 క్యారెట్ల ధర రూ.90,800గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల రేటు రూ.90,650 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,02,900 ఉండగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,900. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.93,900 లుగా ఉంది. ముంబైలో రూ.93,900గా ఉంది. బెంగళూరులో రూ.93,900 . చెన్నైలో రూ.1,02,900 లుగా ఉంది.