అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Rates : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత నెలలో పరుగులు పెట్టిన పసిడి రేట్లు మార్చి 1 నుంచి తగ్గుముఖం పట్టాయి. దీంతో వివాహాది శుభాకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి స్వల్ప ఊరట లభించింది.
సోమవారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.86,620 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.79,400కు చేరింది.
కాగా ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డుకి చేరాయి. ఓ క్రమంలో రూ.90 వేలు దాటుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే రూ.89 వేల మార్క్ దాటింది. తాజాగా మూడు వేల పైచిలుకు ధర తగ్గడం విశేషం.