బంగారం ధర ఆల్ టైం రికార్డు!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆల్ టైం రికార్డుకి చేరుకుంది. గురువారం తులం బంగారం ధర రూ.62,900 (22 క్యారెట్స్), రూ.68,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు రూ.వెయ్యికి పైగా పెరగడం గమనార్హం. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు బంగారం పేరు తీస్తేనే వామ్మో అంటున్నారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.