అక్షర టుడే, వెబ్ డెస్క్ Today Gold Rate : బంగారం ధరలు (Gold Rate) నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పసిడి ధర రికార్డు (Gold Rate Record) స్థాయికి చేరింది. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,190, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.95,170 గా ఉంది. వెండి కిలో ధర (Silver price) రూ.99,700 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధరలు తగ్గాయి.
Today Gold Rate : స్వల్పంగా తగ్గుదల..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170గా ఉంది. ఢిల్లీలో Delhi 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,340, 24 క్యారెట్ల ధర రూ.95,320 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల రేటు రూ.95,170 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది. అమెరికాలో స్పాట్ గోల్డ్ ధర చూసినట్లయితే, 0.4% పెరిగి ఒక ఔన్స్ పసిడి ధర 3,221.32 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ చూసినట్లయితే అది కూడా 0.4% పెరిగి 3,238.70 డాలర్లు పలుకుతోంది.
ఇక వెండి ధరలు విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,700 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,700, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,700 లుగా ఉంది. ముంబైలో రూ.99,700గా ఉంది. బెంగళూరులో రూ.99,700, చెన్నైలో రూ.1,09,700 లుగా ఉంది. కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. డాలర్ Dollar బలహీనత కూడా బంగారం పెరగడానికికారణం అవుతున్నాయి. డాలర్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసం తగ్గుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.