Today Gold Rate : మీదగ్గర డబ్బులుంటే ఈరోజే బంగారం కొనేయండి.. లేట్ చేస్తే ఇంత తక్కువ ధరలో దొరకడం కష్టం

Today Gold Rate : మీదగ్గర డబ్బులుంటే ఈరోజే బంగారం కొనేయండి.. లేట్ చేస్తే ఇంత తక్కువ ధరలో దొరకడం కష్టం
Today Gold Rate : మీదగ్గర డబ్బులుంటే ఈరోజే బంగారం కొనేయండి.. లేట్ చేస్తే ఇంత తక్కువ ధరలో దొరకడం కష్టం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today Gold Rate : ఒకప్పుడు భూముల మీద, బిల్డింగ్ ల మీద, షేర్ మార్కెట్లలో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు. కానీ.. ఇప్పుడు అవేమీ వద్దు. ఒక్క తులం బంగారం కొనుక్కున్నా చాలు అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే.. భూముల ధరలు ఎప్పుడూ పెరుగుతూ వెళ్లవు. కొన్నిసార్లు తగ్గుతాయి కూడా. షేర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక.. వ్యాపారాలు అంటారా? ఎప్పుడు నష్టం వస్తుందో? ఎప్పుడు లాభం వస్తుందో తెలియని పరిస్థితి. కానీ.. బంగారం మాత్రం రోజురోజూ పెరుగుతూ పోతోంది తప్పితే తగ్గడం లేదు. ఒక పది పదిహేను ఏళ్ల కింద బంగారం ధర ఎంత ఉంది. ఇప్పుడు ఎంత ఉంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో బంగారం కొనుక్కొని దాచుకోవడమే మేలని చాలామంది భావిస్తున్నారు.
2025 ప్రారంభం నుంచి స్కై రాకెట్ లా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జెట్ స్పీడ్ లో దూసుకెళ్లాయి ధరలు. దీంతో సామాన్య ప్రజలు అయితే బంగారం వైపు కూడా చూడడం మానేశారు. కానీ.. మార్చి ప్రారంభంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్య ప్రజలు ఇప్పుడిప్పుడే బంగారం షాపుల వైపు చూస్తున్నారు. తాజాగా మార్చి 7న అంటే ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.

Today Gold Rate : ఈ నెల మొత్తం ధరలు తగ్గే ఛాన్స్

ఈరోజు మాత్రమే కాదు.. ఈ నెలలో బంగారం ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బంగారం కొనాలని అనుకునే వాళ్లు ఈ నెలలో ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలని, ఈ రోజు కూడా ధరలు తగ్గడంతో కుదిరితే ఈ రోజు కూడా కొనుక్కోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.7,990 గా ఉంది. 10 గ్రాములు అంటే తులం బంగారం ధర రూ.79,900 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే ఒక్క గ్రాముకు రూ.8,716 గా ఉంది. తులం బంగారం ధర రూ.87,160 గా ఉంది.

Advertisement