అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పసిడి ధరలు మరోసారి కాస్త తగ్గాయి. ఇందూరు మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం రూ. 78,800 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల ధర 72,705కు తగ్గింది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కిలోకు రూ. లక్షకు పైగా పలికిన ధర ప్రస్తుతం రూ. 91,000గా ఉంది.