Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: పసిడి ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజుల పాటు స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు బుధవారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.920 పెరిగి రూ.82,850గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.850 పెరిగి రూ.75,950కి చేరింది. కిలో వెండి రూ.1,04,000 పలుకుతోంది. గురువారం నుంచి మాఘ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో వివాహాలు ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement